ప్రాంతీయం

గల్ఫ్ వాసులకు ప్రజావాణి, సద్వినియోగం చేసుకోవాలి…

63 Views
 ముస్తాబాద్, ఆగస్టు 5 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని ‘ప్రజా భవన్’ లో ప్రతిమంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను గల్ఫ్ ప్రవాసులు వినియోగించుకోవాలని టిపిసిసి ఎన్నారై సెల్  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఒక గంట ముందు ప్రజా భవన్ కు చేరుకోవాలి. వికలాంగులు, మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఉంటాయి. తాగునీరు, ఇతర సౌకర్యాలుంటాయి. 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం లభిస్తుందని తెలిపారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7