విద్య

రాష్ట్రస్థాయి పోటీలకు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు

109 Views

ఎల్లారెడ్డిపేట నవంబర్ 21 :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థులు టార్గెట్ బాల్ పోటీలలో గెలుపొంది. రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ ఎండి లతీఫ్ తెలిపారు.
తెలంగాణ టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో మేడ్చల్ జిల్లాలోని అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ లో జరిగే పోటీలలో తమ పాఠశాల నుండి తొమ్మిదవ తరగతికి చెందిన వై. సంజన, పి. అశ్వితలు పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ లతీఫ్
విలేకరులకు తెలిపారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం కల్పించడం మా పాఠశాల ప్రత్యేకత అని వారు తెలిపారు.
టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్, ప్రిన్సిపాల్ శరత్ కుమార్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు డి, రాకేష్, రాకేష్ డి. భరత్ లు అభినందించారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7