-తిమ్మాపూర్ తహశీల్దార్ కనకయ్య.
(తిమ్మాపూర్ డిసెంబర్ 20)
తిమ్మాపూర్ యంపిడిఒ కార్యాలయం ఆవరణలో తహాశీల్దార్ కే.కనుకయ్య ఆధ్వర్యంలో బిఎల్ఓఎస్, బిఎల్ఓ సూపర్వైజర్లకు ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2024 గురించి ఒక్కరోజు శిక్షణ ఇచ్చినట్లుగా తహాశీల్దార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చెయ్యాలని, మరణించిన వారిని జాబితా తొలగించాలని, తప్పులు లేని ఓటర జాబితాను తయారు చేయాలని కోరారు. బిఎల్ఓ లకు , బిఎల్ఓ సూపర్వైజర్లకు ఓటర్ జాబితా ఫారం 6.7,8 లపై శిక్షణ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రెనర్స్ గా టీ.అమరేందర్ రెడ్డి యం. తిరుపతి రెడ్డి, ఆర్ఐ అక్బర్ హుస్సేన్,సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.