ప్రాంతీయం

నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని త్వరగతిన సిద్ధం చేసి,ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి

125 Views

సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను సోమవారం నాడు ఇంజనిర్లతో,అధికారులతో కలిసి సందర్శించి భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు..
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతు…
జిల్లా ప్రజలకు సత్వర పోలీస్ సేవలుఅందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల సముదాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా ఎస్పీ హోసింగ్ ఏ. ఈ కి సూచించారు.నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని సందర్శించి నూతన భవనా నిర్మాణం జరిగిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రగతిలో ఉన్న పనుల వేగవంతంకు చేపట్టాల్సిన చర్యలు,తదితర అంశాలపై మరియు త్వరగతిన పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై ఇంజనీర్లతో అధికారులతో సమీక్షించారు..
ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ అనిల్ కుమార్, ఏ. ఈ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7