మంచిర్యాల జిల్లా
*అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
అటల్ బిహారీ వాజపేయి శత జయంతి (100 వ జయంతి) సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని శివాజీ మైదానంలో అటల్ బిహారీ వాజపేయి చిత్రపటానికి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరియు అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్ర పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించడం జరిగింది. అనంతరం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7 వ అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు విలువలు నేర్పిన గొప్ప నాయకుడు వాజపేయి గారు అని అన్నారు. వాజపేయి గారు ప్రధాన మంత్రి గా ఉన్న సమయంలో పాకిస్థాన్ తో కార్గిల్ యుద్ధం సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వర రావు, తుల ఆంజనేయులు, రాకేష్ రెన్వా, రెడ్డిమళ్ల అశోక్, బోయిని హరి కృష్ణ, సత్రం రమేష్, అమిరిశెట్టి రాజు, పల్లి రాకేష్, జయరామ రావు, బెల్లంకొండ మురళి, ఆకుల సంతోష్, మెరెడికొండ శ్రీనివాస్, బియ్యాల సతీష్ రావు, బింగి సత్యనారాయణ, చిరంజీవి, పచ్చ వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
