మున్సిపల్ పరది గజ్వేల్ లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు*
న్యూస్ 5, నవంబర్ తూముకుంట నర్సారెడ్డి వారి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని రావటం కోసం గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తూముకుంట నర్సారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని.. కౌలు రైతులకు 12 వేల రూపాయల రైతుబంధు ఇస్తామన్నారు రైతులను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదని అన్నారు.. రైతులను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ అని రైతు బాంధవుడు తూముకుంట నర్సారెడ్డి వారి ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు
ఈ కార్యక్రమంలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సంబంధించిన నాయకులు పాల్గొన్నారు