ప్రాంతీయం

ఆంక్షలులేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి…

68 Views

ముస్తాబాద్, జూలై 31 (24/7న్యూస్ ప్రతినిధి): బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజాగౌడ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లోఉన్న ప్రభుత్వపథకం 2.లక్షల రుణమాఫీ ప్రవేశపెట్టి 3.విడతలుగా రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అయితే సాంకేతిక లోపంతో కూడుకున్నదని రైతులయొక్క జాబితాను ఇప్పుడు చేయలేకపోతున్నాంమని అధికారులు చెబుతున్నారు. ఆధార్ లింక్ లేదని బ్యాంకుకు అకౌంటు సరిగ్గా లేదని ధరణివల్ల ఉన్నభూమి ఆన్లైన్లో చూపించడంలేదని చాలామంది రైతుల రుణమాఫీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. సాంకేతిక లోపాలు ఏమైనాఉన్నా రైతులను వ్యవసాయ అధికారులద్వారా సమాచారం పంపి సరిచేసి వారి రుణమాఫీ జరిగేలా చూడగలరని పేర్కొన్నారు. లేదంటే మండల కేంద్రంలో రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7