ప్రాంతీయం

రిలే నిరాహార దీక్షకు దిగిన గజ్వేల్ న్యాయవాదులు

117 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సబ్ కోర్టు జిల్లా కోర్టు నూతన భవనం కోసం గత తొమ్మిది రోజుల నుండి గజ్వేల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి చేస్తున్న ధర్నాకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగిన గజ్వేల్ న్యాయవాదులు, ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గత తొమ్మిది రోజుల నుండి చేస్తున్న దీక్షకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగామని చెప్పారు, ప్రభుత్వం నుంచి హామీ వచ్చేవరకు ఈ రిలే నిరాహార దీక్ష ఇలాగే కొనసాగుతుందని, సబ్ కోర్టు, జిల్లా కోర్టు, నూతన భవనం కోసం పోరాటం ఆపమని పత్రికా ముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, సీనియర్ న్యాయవాదులు బాల ముకుంద రెడ్డి, హరి శంకర్, గడిల శ్రీనివాస్, కాళీ ప్రసాద్, హరికృష్ణ, కనకయ్య, నర్సింలు, సుదర్శన్, నరేష్ చారి, అబ్దుల్ గఫార్, ఎల్లంరాజు, రామకృష్ణ, ప్రశాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7