బిజెపి జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దాస్ దివాస్ కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా.
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గురు నానక్ పుత్రులైన జురావర్ సింగ్ ఫతేసింగ్ బాలల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క దేశభక్తి ధర్మానిష్ట ధైర్యసాహసాలను బాల దివస్ మంచిర్యాల జిల్లా కన్వీనర్,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ కొనియాడుతూ 7 మరియు 9 సంవత్సరాలు చిన్న వయసులోనే జురావర్ సింగ్ ఫతేసింగ్ లను బంధించినమొగల్ ఆక్రమణదారుడు వజీర్ ఖాన్ ఈ పిల్లలనిమతం మారమని వీరిని ఎంత బెదిరించినను బెదరక మేము మతం మారిన మరణం తప్పదు నీవు ఇస్లాంలో అనుసరిస్తున్న నీ మరణాన్ని జయించలేవు అని వజీర్ ఖాన్ కు ఎదురు చెప్పడం జరిగింది ధన ఆశ చూపిన రాజ్యం ఇస్తానని ఆశ చూపిన జురావర్ సింగ్ ఫతేసింగ్ వినకపోవడంతో ఈ ఇద్దరు బాలలని కూడా సజీవ సమాధి చేయిస్తాడు ఇంతటి వీర బాలల చరిత్ర మన పాఠ్యపుస్తకాలలో చేర్చకపోవడం శోచనీయం అని అన్నారు. ఈ పిల్లల జ్ఞాపకార్థం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీరబాల దివస్ పేరున ధైర్య సాహసాలు ప్రదర్శించిన పిల్లలకి రాష్ట్రీయ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీర బాల దివస్ కోకోన్వీనర్లు వైద్య శ్రీధర్, జయరామరావు, శ్రీదేవి మరియు కార్పొరేషన్ సెంట్రల్ జోన్ అధ్యక్షలు రంగ శ్రీశైలం గుండ రాజబాబు, తిరుమల, ముదాం మల్లేష్ ఉప సర్పంచ్, పున్నం చంద్, మల్లేష్, మచ్చ కుర్తి కిషోర్, నాగుల రాజన్న మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.
దుర్గం అశోక్, చెన్నూరు నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి.





