గజ్వేల్ నియోజకవర్గం ఐఎన్ టియుసి ఇన్చార్జిగా వీరబోయిన గోవర్ధన్ నియోజకవర్గం అధ్యక్షునిగా ఏషం నాగరాజు ఇటీవల నియామకం అయ్యారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టిపిసిసి డెలిగేట్ సభ్యులు మాదాడి జశ్వంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు ఈసందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తు కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాగరాజు, గోవర్ధన్ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలో గుర్తింపు తెచ్చుకోవాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అని అన్నారు అలాగే నాగరాజు,గోవర్ధన్ మాట్లాడుతూ మాకు పదవి రావడానికి సహకరించిన మా దాడి జస్వంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు, కార్మిక విభాగము కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటిదని గజ్వేల్ నియోజకవర్గం లోని సంఘటిత అసంఘటిత కార్మికుల యొక్క సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ,కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ విజయ్,కాంగ్రెస్ నాయకులు నర్సంపల్లి నాగరాజు, కిష్టారెడ్డి,రఘుపతి,నరేందర్,దేవేందర్, రవి తదితరులు పాల్గొన్నారు