ప్రాంతీయం

కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా మొగుళ్ళ ప్రశాంత్ ఎన్నిక

35 Views

కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా మొగుళ్ళ ప్రశాంత్ ఎన్నిక

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, ఆగస్టు 12, తెలుగు న్యూస్ 24/7

కొమురవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ నేతృత్వంలో జరిగిన వార్డ్ మెంబర్ల ఫోరం కమిటీ ఎన్నిక జరుగగా అయినాపూర్ గ్రామానికి చెందిన 6 వ వార్డ్ మెంబెర్ మొగుళ్ల ప్రశాంత్, ను కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ప్రశాంత్, మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వార్డ్ మెంబర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం వార్డు మెంబర్ల సమస్యలను గుర్తించి ఆరోగ్య భద్రత ఐడి కార్డులు గౌరవ వేతనం అందించాలని వార్డు మెంబర్ల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పార్టీలకతీతంగా పనిచేస్తానని తెలిపారు,కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా పిన్నింటి రేఖ,గొల్లపల్లి రాజమణి, ఉపాధ్యక్షురాలు ముత్యం స్వప్న,ములుగు చంద్రమౌళి,ప్రధాన కార్యదర్షులుగా చింతల పర్షరాములు,చెక్కలి అంజలి,చుంచు శ్రీనివాస్, బ్రాహ్మడ్లపల్లి బాబు, కార్యదర్శులుగా ఎక్కాల దేవి మహేష్,మాట్ల మురళిని,ఐలయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *