ముస్తాబాద్, జూలై 27 (24/7న్యూస్ ప్రతినిధి):
డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బదనకల్లో విద్యార్థుల కథల కవితల అంశాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి పత్తిపాక ఫౌండేషన్ మరియు గరిపెల్లి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పత్రాలు అందించామని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.రాజ్ కుమార్, తెలుగు ఉపాధ్యాయుడు రాములునాయక్, ఉపాధ్యాయ బృందం వేణుగోపాల్ చారి, సత్యనారాయణరావు, బాలకిషన్, అనిత, స్వరూప, ఉమారాణి, శారద, రవీందర్, రమణ, పర్శరాములు విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.





