అక్టోబర్ 2
అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ 154వ జయంతి సందర్భంగా మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, సాయిని మహేష్ నివాళులు అర్పించారు. మహాత్ముని 153వ జయంతి ఉత్సవాలు ముగిసి 154వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే…ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసిఆర్ అన్నారు. భరతమాత తల రాతను మార్చి, తరతరాల యమ యాతను తీర్చిన విధాత గాంధీజి అయితే తెలంగాణ తల్లి తల రాతను మార్చి…ఆత్మగౌరవ ప్రతీకను ఎగురవేసిన ఉద్యమ నేత సిఎం కేసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మొర్సు శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, ప్రవీణ్ రెడ్డి, శ్రీను, శ్రీకాంత్,కరుణాకర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు
