మర్కుక్, జులై 22
మర్కుక్ మండలంలోని మర్కక్, ఎర్రవల్లి మరియు దామరకుంట రైతు వేధికలలో 2024 సంవత్సరానికిగాను రైతు భీమా నమోదు వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి టి .నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు బీమా పథకం లో కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు వచ్చినవారు మరియు రైతు బీమా లో ఇది వరకు నమోదు కాని రైతులు దరఖాస్తు చేసుకోవాలి. అని, 18సం . నుండి 59 సం . లోపు వయస్సు గల పట్టాదారులు అర్హులు అని తెలిజేశారు. దీనికి గాను రైతు బీమా ఫారం, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్ జతపరిచి రైతు వేదిక లో వెంటనే సమర్పించగలరని తెలియజేసారు. రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు, ఈ ప్రేమియంని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది అని తెలిజేశారు . ఏ కారణం చేత రైతు మరణించిన రైతు నామినికి 5లక్షల భీమా అందించబడును. రైతు భీమా లో పేరు తప్పుగా నమోదు జరిగిన లేదా మీరు ఎంచుకున్న నామిని మరణించిన లేదా మీరు మీయొక్క నామిని ని మార్చుకోవాలి అనుకున్నా వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మార్పులకు దరఖాస్తు చేసుకోగలరు అని తెలిజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రజినీకాంత్, విష్ణు వర్ధన్ మరియు అశ్విని , రైతులు పాల్గొన్నారు.
