మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దౌర్తాబాద్ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్థిక ఇబ్బందులతో ఆడబిడ్డ వివాహం చేయడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబానికి చేదోడుగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. బి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్ప దయాకర్. దౌల్తబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామానికి చెందన మద్దెల నర్సయ్య సుగుణ కుమార్తె లావణ్య వివాహనికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడంమే లక్ష్యంగా ఉమ్మడి మండల వ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగవుతోందని దానిని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని పేర్కొన్నారు. సామాజిక సేవను యువత సామాజిక బాధ్యతగా భావించాలని అలాంటి వారిని ప్రోత్సహించడం సమాజంలో మానవుడిగా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించాలని సూచించారు. మనిషిని చిరస్మరణీయంగా సమాజం గుర్తించుకోదగిన విధంగా తీర్చిదిద్దడానికి సమాజ సేవ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాయం చిన్నదైనా పెద్దదైన సాయం చేసే మనసు ఉండటం గొప్ప విషయమని దైవ సేవ కన్నా మానవసేవ ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సాటి మానవుల పట్ల సహృదయదా సహనం చూపినప్పుడే శాంతి సమస్త సమాజ నిర్మాణ సమాజం స్థాపితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివ కుమార్, ఉప్ప సర్పంచ్ బాబు, నల్ల శ్రీను, శ్రీకాంత్, ఎం ర్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నర్సింహులు, శ్రీనివాస్, శంకర్, మాజీ ఎంపీటీసీ స్వామి, సుధాకర్, కరుణాకర్, సుమన్, స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
