ప్రాంతీయం

బ్యాంక్ ఆఫ్ బరోడా…

133 Views

జులై 20, 24/7 తెలుగు న్యూస్ :ప్రపంచ ఆర్థిక సంస్థగా ఎదిగిన బ్యాంక్ ఆఫ్ బరోడా

వినియోగదారులకు మెరుగైన సేవలు అందిండమే లక్ష్యం

ఆవిర్భావ వేడుకల్లో వర్గల్ శాఖ మేనేజర్ మౌనిక

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా చక్కటి ప్రపంచ ఆర్థిక సంస్థగా ఎదిగినట్లు వర్గల్ శాఖ మేనేజర్ మౌనిక పేర్కొన్నారు. శనివారం వర్గల్ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ, మరియు వ్యవసాయ బ్యాంకింగ్ కార్యకలాపాలతో వినియోగదారుల ప్రశంసలు పొందుతున్నట్లు స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు, రైతులు, వ్యాపారులను ఆర్థికంగా శక్తివంతం చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, గృహ, వాహన, చిరు వ్యాపారo, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రుణ సేవలందించడం, క్రెడిట్ కార్డులు, డిపాజిట్లు, సేవింగ్స్ పై అధిక వడ్డీ తదితర వాటిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అయితే వినియోగదారుడికి ఆగ్రశ్రేణి బ్యాంకుగా సేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. లాభదాయక, స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలు తీర్చడానికి సులభమైన, సురక్షితమైన సేవలను తమ సంస్థ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే 1908 లో అప్పటి వడోదర మహారాజు సాయాజిరావు గైక్వాడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ను స్థాపించగా, 1969లో భారత ప్రభుత్వ ఆమోదంతో జాతీయ ప్రభుత్వ బ్యాంకుగా రూపుదిద్దుకొని వందకు పైగా దేశాలలో విస్తరించి వివిధ రకాల సేవలoదిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసర్స్ లకావత్ మల్సూర్ ,దొడ్ల. వెంకటేష్, బొనగిరి రాకేష్ ,బ్యాంక్ సిబ్బంది స్వాతి ,ప్రియాంక, వినియోగదారులు గుండ విశ్వేశ్వరరావు, వర్గల్ గ్రామ ఉపసర్పంచ్ పసుల రమేష్ ముదిరాజ్ ,కరుణాకర్ రెడ్డి ,నూక బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7