రాజకీయం

దళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై అసెంబ్లీ లో చర్చించాలి.

79 Views

దళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై అసెంబ్లీ లో చర్చించాలి.

– డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

మర్కుక్ , జులై 20 :

ఈ నెల 23 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో దళుతుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై చర్చించాలని శనివారం నాడు ఒక ప్రకటనలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయలన్నారు.గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బందు పథకం 10 లక్షలకు బదులు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తానన్న హమీ ని నిలబెట్టుకొవడానికి మార్గదర్శకాలను రూపొందించాలన్నారు.ఎస్సీ, ఎస్టీ కమీషన్ ను విడదిసి ఎస్సీ కమీషన్,ఎస్టీ కమీషన్ లను ఏర్పాటు చేస్తాననే హామీ నిలబెట్టుకొవాలన్నారు.

గత 10 సంవత్సరాల నుండి నూతన రేషన్ కార్డులు రాకపోవడం వలన ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలకు దళిత,బహుజనులు అనర్హులుగా మిగిలిపొతున్నారు గనుక వెంటనే రేషన్ కార్డు జారిపక్రియ కొనసాగే విధంగా చేయలన్నారు.రైతు రుణమాఫీ పక్రియలో ఎటువంటి నిబంధనలు పెట్టకుండా ప్రతి రైతుకు పాసు బుక్ ప్రామాణికంగా అమలుచేయలన్నారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయంలో 29.144 కొట్లు మాత్రమే రుణమాఫీ చేశారు కాని కాంగ్రెస్ ప్రభుత్వం 8 మాసాలలోనే 31 వేల కొట్లు రుణమాఫీ చేశారని చెబుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వానికి అదర్షంగా ఉండాలంటే రుణమాఫీని శరతులు లేకుండా అమలు చేయాలని కొరుతున్నాం.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ లపై రొజుకొ దగ్గర దాడులు,దౌర్జన్యాలు కొనసాగుతున్నందున,నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి,శాంతి బద్రతలకు అటంకం లేకుండా ఉండటానికి సాంఘీక సంక్షేమ మంత్రిని,విద్యాశాఖ మంత్రిని,హోం మంత్రిలను కేటాయించాలన్నారు.ఈ కార్యక్రమం లో సినియర్ దళిత నాయకులు చంద్రం పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found