చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 12 :
ఎల్లారెడ్డిపేట మండలం అక్క పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పండుగ సందర్భంగా శనివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు,
ముదిరాజ్ సంఘానికి చెందిన వారు ఇంటికో బోనం చొప్పున పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనం ఎత్తి భారీ ఊరేగింపుతో డప్పు. చప్పుల్లతో ఘనంగా పోచమ్మ భోనాల పండుగ నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జిన్న నాంపల్లి , ప్రతినిధులు పిట్టల మోహన్, దుండిగాల బాలయ్య , జిన్న శ్రీ ను , గుమ్మడి బాలకృష్ణ , కనకయ్య , తదితరులు పాల్గొని గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు
