తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రాయపోల్ మండలం కేంద్రంలోని రైతు వేదికలో సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేసి రైతులతో కలిసి స్వీటు పంపిని చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. కొందరు బిఆర్ఎస్ నాయకులు రైతులకు అబద్దాల ప్రచారం చేస్తూ రైతులను మభ్య పరుస్తున్నారన్నారు. దేశ చరిత్రలో 2 లక్షల ఏకకాల రుణమాఫీ ప్రతి రైతును రుణ విముక్తి చేయాలనేదే రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి 2 లక్షల రుణమాఫీ
ఇప్పటికైనా ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మీ అబద్దాపు పూరిత ప్రచారలు మానుకోవాలని హెచ్చరించారు. మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తున్నం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి కృష్ణ గౌడ్, మండల యువజన అధ్యక్షులు దయాకర్, మండల సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డి, రేకుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




