సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతినీ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ స్థాయిలో అధిక అవార్డులను సాధించిన ఇటిక్యాల గ్రామ పంచాయతి గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు ఆదివారం నాడు ఘన సన్మానం చేసి అభినందించిన యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ స్థాయిలో 9 విభాగాలలో దీన్ దయాళ్ అవార్డులు ఐదు విభాగాలలో అవార్డులు అందుకున్న జిల్లాలోని మొట్ట మొదటి గ్రామపంచాయతీ ఇటిక్యాల అనీ అందుకు కృషి చేసిన సర్పంచ్ చంద్రశేఖర్ అభినందనీయులని సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ లాంటి యువ సర్పంచ్ ఎందరికో ఆదర్శనీయుడు అని యువత రాజకీయాల్లోకి రావడం వల్ల ఇలాంటి అభివృద్ధి జరుగుతుందని దశాబ్దాల కాలంలో అభివృద్ధి జరగని అభివృద్ధి యువ నాయకుడు చంద్ర శేఖర్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత జరగడం అభినందనీయం అని సర్పంచ్ గా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ సర్పంచ్ అవార్డ్ అందుకున్న చంద్ర శేఖర్ పలువురికి ఆదర్శం అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ పాలక వర్గం, సోషల్ వర్కర్ నర్సోల్ల గణేష్, గ్రామ రైతు అధ్యక్షులు ఆడెపు బిక్షపతి పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటేష్, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సోల్ల స్వామి, మాజీ కొండపోచమ్మ డైరెక్టర్ దొడ్డి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
