ప్రాంతీయం

121 Views
  • : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై 45 మంది లబ్ధిదారులచే గృహా ప్రవేశాలు చేయించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అలాగే గ్రామ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, 750 ఏంటీ స్టోరేజీ గోదాము, డ్రాయింగ్ ప్లాట్ ఫామ్ లకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ జెడ్పీ హైస్కూలు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

– రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కామెంట్స్:

– పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం.

– సద్దితిన్న రేవు తలవాలి. నియత్ ఉంటేనే బర్కత్ ఉంటదనీ సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారులను కోరిన మంత్రి.

– గత గజ్వేల్ పాలకులు సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి జరిగింది.

– కాంగ్రెస్, టీడీపీ పార్టీలో ఇవ్వని కళ్యాణ లక్ష్మీ పథకం, మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఅర్ ఇస్తుండు.

– కాంగ్రెస్ హయాంలో ఇండ్లకు 40 వేల రూపాయలు ఇస్తే బేస్మెంట్ కూడా సరిపోక పోతుండే. ఇండ్లు కట్టిచ్చి గృహ ప్రవేశాలు చేసి ఇస్తున్న ఘనత మన టీఆరెఎస్-సీఎం కేసీఆర్ ప్రభుత్వంది.

– ఢిల్లీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల వడ్లు కొనమంటే నూకలు బుక్కండని అవహేళన చేసింది.

– నూకలు బుక్కమన్న బీజేపీ పార్టీ వాళ్ళు గ్రామాల్లో తిరిగితే వారి తోకలు కత్తిరించండి.

– సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అన్నీ ఉచితంగా పంచుతుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్నీ పెంచుతున్నది.

– టీఆరెఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వం. మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7