అమరుల త్యాగఫలంతోనే తెలంగాణ ప్రాంతానికి నిజాం నవాబు చేరల నుండి విముక్తి కలిగిందని దౌల్తాబాద్ మండలంలో ని ముబారసుపూర్ గ్రామ సర్పంచ్ యాదగిరి అన్నారు.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెప్టెంబర్ 17ను
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించి జాతీయజెండానుఎగురవేయాలని పిలుపుమేరకు గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ యాదగిరి జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం ఏర్పడినంతరం తెలంగాణ నిజాం పాలనలో ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 13 నుండి 17వరకు నాలుగురోజులోనే నిజాం పైపోరాడి తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం తెచ్చి పెట్టారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర పాలకుల చేతిలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథము నడుపుతున్నరన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతి, యన్ లక్ష్మణ్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వైకుంఠం, భుట్క రాములు వార్డ్ సభ్యులు మరియు ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.