ముస్తాబాద్, జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో ఇటీవల ముస్తాబాద్ పట్టణ ప్రభుత్వ అధికారులు నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో కట్టిన ఫ్లెక్సీ పైన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఫోటోని ఫ్లెక్సీలో వేయకుండా అవమాన పరిచే విధంగా. ప్రభుత్వ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధ నరేష్ డిమాండ్ చేశారు. దీనికి కారణమైన స్థానిక మండల తహశీల్దార్ తీరుపైన తహసిల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కాసేపటికి తహశీల్దార్ చేరుకొని ముస్తాబాద్ తాసిల్దార్ ఇటీవల జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ఫోటో పెట్టకపోవడం తప్ప
ని ఇకముందు ఇలాంటి తప్పిదం చేయమని హామీ ఇచ్చారని బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, ఓబిసి మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, మండల బీజేవైఎం అధ్యక్షులు కుడుకల జనార్ధన్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు కళ్యాణ్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు చిట్టి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కరెడ్ల రమేష్ రెడ్డి, గూడ బాల్ రెడ్డి మాజీ మండల ఉపాధ్యక్షులు తిరుపతి యాదవ్, సీనియర్ నాయకుడు కోల కృష్ణగౌడ్, గున్నాల రమేష్ గౌడ్, పిట్లఎల్లం, శ్రీను, మద్దికుంట రమేష్, చీకోటి మహేష్, రంజిత్ వినయ్ జరిగింది.




