ప్రాంతీయం

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజుకు సన్మానం

75 Views

గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకి భక్తిరత్న జాతీయ పురస్కారం వచ్చిన శుభ సందర్బంగా సిద్దిపేట పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో సోమవారం శ్రీరామభక్త బృందం ఆధ్వర్యంలో రామకోటి రామరాజుకి శాలువా కప్పి జ్ఞాపిక అందజేషి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా శ్రీరామ భక్త బృందం వారు మాట్లాడుతూ శ్రీరామ తారక మంత్రాన్ని గత 25 సంవత్సరాల నుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అమెరికా లాంటి ప్రాంతాల నుండి లిఖింప జేయడం అయన రామభక్తికి నిదర్శనం అన్నారు. చదువు రాని వారితో సైతం కోటి రామనామాలు లిఖింప జెపించడం రామకోటి రామరాజు కృషి పట్టుదల అమోఘం అన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సాహితి సంస్థ వారు భక్తిరత్న జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. మా యువతకు రామకోటి రామరాజు ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ బృందం ప్రతినిధులు తంగళ్లపల్లి నరేష్, అయిత శ్రీకాంత్, బొల్గం శ్రీనుగౌడ్, జపా మధుసూదన్ రెడ్డి, మామిడాల సురేష్, నాగేందర్, వేణు, చిరంజీవి, అర్చకులు మల్లిపెద్ది నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka