ప్రాంతీయం

ప్రభుత్వ విప్ ను ఘనంగా స్వాగతించిన ఎన్ ఎస్ యుఐ…

103 Views

ముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించడానికి ముస్తాబాద్ విచ్చేసిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను ఎన్‌ఎస్‌యు మండల అధ్యక్షుడు సారుగు రాకేష్‌ తొలుత ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఇందులో భాగంగా సీనియర్ నాయకులు దీటి నర్సింలు, తోట ధర్మేందర్ గల్ఫ్ బాధితుల గురించి వినతి పత్రం సమర్పించి స్వీట్లు పంచారు. ఆ వెంటనే ఆది శ్రీనివాస్ సంతోషం వ్యక్తంచేసి సారుగు రాకేష్ ను శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి ఆనందోత్సవాలతో ఆ క్షణాలు గడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్