ప్రాంతీయం

కుక్కల దాడిలో గేదెదూడలు మృతి ప్రభుత్వం ఆదుకోవాలని రైతు…

61 Views

ముస్తాబాద్, జూలై 13 (24/7న న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ అనేరైతు గేదదూడలపై శనివారం వేకువదామున కుక్కలు దాడిచేసి చంపడమే కాకుండా వాటిని కొంత మేరకు పీక్కు తిన్నాయని బాధిత రైతు బండి శ్రీకాంత్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ అనే రైతు తన పొలంవద్దనున్న షెడ్డులో ఎప్పటిలాగా పాడిగేదలను సాయంత్రం కట్టేసి ఇంటికి వచ్చారు. తెల్లవారుజామున పొలం వద్దఉన్న షెడ్డులో చూడగా గేదదూడలు రెండు చనిపోయి ఉండటంతో రైతు బండి శ్రీకాంత్ స్థానికులకు వివరించి చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు ప్రభుత్వం ద్వారా చేతనైనంత సహాయం అందించాలని శ్రీకాంత్ కోరాడు. కుక్కల బెడద నుంచి నాకు జరిగిన నష్టం మరి ఎవరికి జరగకూడదని అధికారులు చర్య తీసుకోవాలని కోరాడు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్