ప్రాంతీయం

గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఈబడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలి తోటధర్మేందర్, దీటి…

178 Views
ముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి):   తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో  బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదం ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు.  
◉ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలి
◉ గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి 
◉ సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) ప్రవేశపెట్టాలి
◉ గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి  రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన జీవో విడుదల చేయాలి. 
◉ గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లిన వారి గురించి సమగ్ర సర్వే చేయించాలి
◉ రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్ట్ నుండి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించవద్దు. అన్ని సంక్షేమ పథకాలను గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయాలి
◉ జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి
◉ విదేశాల నుండి వాపస్ వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి
◉ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలి.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7