ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, జడ్చర్ల నియోజకవర్గం వడియాల గ్రామంలో 3టీవీ ఛైర్మన్, జర్నలిస్ట్ కడమంచి చెన్నయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన తెలంగాణ బేడ బుడగ జంగం యూత్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకొని ప్రజల మన్ననలు పొందుతూ తాను ఏర్పాటు చేసిన త్రీటి టీవీ ఛానల్ అనతి కాలములోనే ప్రజాదరణ పొందడం, ప్రజా సమస్యలను నిస్వార్ధంగా, అన్యాయాలను ప్రజల గొంతుక గా ప్రశ్నించడం ఓర్వలేని కొందరు గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసినవారు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనుచరులు అని జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బేడ బుడగ జంగం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
