ముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను రూపొందించి త్వరలోనే అమలు చేస్తామన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్యంపట్ల పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
