సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు భక్త జనాలతో ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంలోని మహిళా మణులు సత్యసాయి భక్తులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.గణపతి మండపం దగ్గర, సత్యసాయి విగ్రహం దగ్గర ఓంకారం స్వస్తిక్ శివలింగం పూలతో అలంకరించే దీపారాధ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ నుండి గంగిశెట్టి గిరిధర్ మాట్లాడుతూ పవిత్ర మాసమైన కార్తీక మాసంలో దీపారాధన ఉత్సవాలు శ్రీ సత్యసాయి సేవా మందిరం జరగడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు, అజ్ఞానం అని అంధకారాన్ని తొలగించి జ్ఞాన విలువలు ప్రసాదించేది కార్తీకదీపం అని ఆ దీప కాంత వెలుగుల్లో ఈ సత్యసాయి మందిరం, దేదివ్య మానంగా ప్రకాశిస్తుందని పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి సేవ సమితి ట్రస్ట్ నుంచి ఇదివరకు దేశంలోని ఎన్నో గ్రామాలకు ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది కలగకుండ మంచినీటి ట్యాంకును, ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను సత్య సాయి ట్రస్ట్ నుంచి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
సరఫరా నుండి తొలగించి ప్రసాదించి