ఆధ్యాత్మికం

మానసిక వికలాంగుల మధ్య శ్రీ వర్షిత పుట్టినరోజు వేడుకలు..

527 Views

(తిమ్మాపూర్ జూలై 19)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి చెందిన వేల్పుల రమేష్ -సబిత దంపతుల కుమార్తె శ్రీ వర్షిత రెండోవ పుట్టినరోజు వేడుకలను తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలోని స్వాతంత్ర సమరయోధుల మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు..

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తమ కూతురి పుట్టినరోజు వేడుకలను మా కుటుంబ సభ్యులతో కలిసి మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం చాలా గొప్పదని ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా సేవాభావం కలుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాలకు నాకు తోచిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో వేల్పుల లక్ష్మయ్య -చిలుకవ్వ, తమ్మనవేణి స్వరూప, సునీత పాఠశాల అడ్మిస్టేటర్ బాలరాజు, ప్రిన్సిపాల్ సతీష్, వార్డెన్ రమేష్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
కొమ్మెర రాజు తిమ్మాపూర్