విద్య

శిక్షణ నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు పొందాలి..

59 Views

టాస్క్ ట్రైనర్ రత్నప్రియ

(తిమ్మాపూర్ జూలై 10)

సాంకేతికతను అందిపుచ్చుకుని, నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోని, ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ విద్యార్థులకు సూచించారు.

తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలలో హైదరాబాద్ కు చెందిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ కళాశాల విద్యార్థులకు పైథాన్ ప్రోగ్రాం యొక్క బేసిక్ నుండి అడ్వాన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను వెబ్, స్కాఫింగ్, డిజాంగో మెదలగు అంశాల పైన మూడు రోజుల పాటు నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇస్తున్నట్టు ఆమె తెలిపారు. అతి సులువుగా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఏలా పొందలో విద్యార్థులకు సూచించారు.

అనంతరం జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ

కళాశాల విద్యార్థులు ఈ ప్రోగ్రాం ని బయట ట్రైనింగ్ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని భావించి, టాస్క్ లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు కళాశాలలో ఉచితంగా టాస్క్ లోని అనుభవజ్ఞులైన ట్రైనర్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నమని కావున విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని, అతి సులువుగా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందాలని, భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాల్లో నిలిచి, కళాశాలకు తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు..

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ఎస్ రావు, విభాగాధిపతి డాక్టర్ జగదిషన్ కోఆర్డినేటర్ ఆర్ వెంకటేశ్వర్లు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్