నేరాలు విద్య

డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన…

169 Views

-డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు..

ఎక్సైజ్ సీఐ బాబా

(తిమ్మాపూర్ జూలై 10 )

నేటి సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి బారిన పడకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్నా ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎక్సైజ్ సీఐ బాబా,ఎస్ఐ భారతి,లు అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలల్లో, స్కూల్స్ లలో మాదకద్రవ్యాల వినియోగం,దుష్పరినామాల పై అవగాహన కల్పించుటలో భాగంగా మండల కేంద్రం అలుగునూర్ లో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరు అరికట్టేందుకు కృషి చేసినప్పుడే వాటిని నిర్మూలించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులకు హలో సూచనలు అందజేసి మార్కద్రవ్యాలను నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్, శ్రీ, కానిస్టేబుల్స్ నరేష్, సురేష్,నవత,వంశీ, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్