భక్తిరత్న రామకోటి రామరాజుకు ఘన సన్మానం
25సంవత్సరాల నిర్వీరామ సేవ అమోఘం
ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి
భక్తి రంగంలో 25సంవత్సరాల విశేష సేవలకు గాను జాతీయ స్థాయిలో భక్తిరత్న పురస్కారం అందుకున్న రామకోటి రామరాజును మంగళవారం నాడు ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణ ముద్దుబిడ్డ, అపర రామ భక్తుడు రామకోటి రామరాజు. గత 25సంవత్సరాల పాటు భక్తి మార్గంలో తనదైన ముద్ర వేస్తు మరో రామదాసుగా భద్రాచల దేవస్థానమే గుర్తించడం మన గజ్వేల్ వాసిగా ఆనందంగా ఉందన్నారు.
తన సేవలు సమాజానికి మేలుకొలుపుగా, అలుపెరగని యోధుడిలా పని చేస్తాడని కొనియాడారు. మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం హర్షించదగ్గ విషయం. మరెన్నో అవార్డులు, రివార్డ్లు భవిష్యత్తులో రామకోటి రామరాజును వరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్స్ రహీం, మెట్టయ్య, శ్రీనివాస్, చందు, శ్రీధర్. నాయకులు నావాజ్ మీర, విజారత్ అలీ, స్వామి చారి, అహ్మద్, గోలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.





