ప్రాంతీయం

ఘనంగా సిద్ధప్ప వరకవి జయంతి వేడుకలు…

115 Views

ముస్తాబాద్, జూలై 9 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని కుమ్మరి శాలివాహన మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 121. వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరు 1903వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లె గ్రామంలో జన్మించారు. వీరి కుటుంబం చాలా పేదరిక కుటుంబం అలాగే సిద్ధప్ప వరకవి మాకుల అభివృద్ధికై చాలా సుదీర్ఘంగా పోరాటం చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమిటంటే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి మేము కోరుకునేది ఒక్కటే వివిధ కులాలను ఎలాగైతే గుర్తిస్తున్నారో అలాగే మా కుమ్మరి శాలివాహన కులాన్ని గుర్తించి  గ్రేటర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మాకు సంబంధించినటువంటి మా కుల బాంధవులు అయినటువంటి సిద్ధప్ప వరకవి విగ్రహాన్ని ఆవిష్కరించి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాంమనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిలివేరి స్వామి, ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు, క్యాషియర్ దరిపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఎదునూరి మల్లయ్య, ఆవునూరు ఎల్లయ్య, ఇల్లందుల వెంకట్, ఎదునూరి రామచంద్రం, పట్టణ అధ్యక్షులు ఏదునూరి అంజయ్య, ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్, శాలివాహన యువజన సంఘం అధ్యక్షులు ఎదునూరి భానుచందర్, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య, స్వామి, లక్మిపతి, అశోక్, మండలంలోని అన్ని గ్రామాల కుల సభ్యులందరూ  పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7