ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జరిమానా

53 Views

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జరిమానా

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13 తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు,వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవారంం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి  ముందు హాజరుపరచగా విచారణ చేసి నలుగురికి మొత్తం రూ.41,000- జరిమానా విధించారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఐదుగురు వ్యక్తులకు ఒక్కొకరికి 5,000 చొప్పున 25,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ల కి ప్రమాదం  రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ళ ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్  విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *