మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలోని వ్యాపార ప్రాంతాల్లో రోడ్ విస్తరణ, భూగర్భ మురికి కాలువ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం రోడ్ వెడల్పులో భాగంగా కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్రోడ్ మెయిన్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాన్క్ రోడ్ లలో భూగర్భ మురికి కాలువలు, ఫుట్ పాత్ నిర్మాణం జరుపుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో పనులు చేపట్టి జూన్ వర్షాకాలం లోపు నిర్మాణాలు పూర్తి చేసి సుందరీకరణ చేస్తానని భరోసా ఇచ్చారు. భూగర్భ మురికి కాలువలు, కేబుల్ వ్యవస్థ గురుంచి విన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీ లలో ఇదే ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారని తెలిపారు. అభివృద్ధి కి సహకరించాలని ఎవరు ఆటంకం కల్పించవద్దని కోరారు. మంచిర్యాల నియోజకవర్గం ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్షకులకు ఎంతో ఇష్టమైన పండుగని అన్నారు. కుటుంబసభ్యుల సందడి, పిండి వంటలు, కొత్త బియ్యంతో భోజనం ఇలా సంతోషంగా పండుగ జరుపుకుంటారని తెలిపారు.
