ప్రకటనలు

వ్యాయామంతోనే ఆరోగ్యం: జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్

119 Views

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన వ్యాయామశాల ను పోలీస్ అధికారులతో కలిసి సోమవారం ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి ,విధులతో పాటుగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆకాంక్షించారు.

జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారుల సంక్షేమనికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు , సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటానికి ఈ జిమ్ అందుబాటులోకి తీసుకరావడం జరిగిందని అన్నారు.పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక,వ్యాయామం, యోగ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు.

పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిమ్ కోచ్ తో సహా అత్యాధునిక GYM (వ్యాయమ శాల) అందుబాటులోకి తీసుకవచ్చిన జిల్లా ఎస్పీ కి అధికారులు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి, సి.ఐ కృష్ణ, మోగిలి, ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7