మంచిర్యాల జిల్లా.
ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు.
ఈరోజు కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ని కలిసి ఆటో కార్మికుల సమస్యల మీద వినతి పత్రం అందజేసిన నస్పూర్ టౌన్ నాయకులు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇబ్బందులు మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు సౌకర్యర్థంగా ఉన్నప్పటికీ ఆటో కార్మికులకు గిరాకీ లేక ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, రెక్కడితే గానీ డోక్కాడని దయనీయమైన పరిస్థితిలో ఆటో కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులు రోడ్డున పడిన పరిస్థితి మీకు తెలిసిన విషయమే. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం రూ” (12000 )కాకుండా సంవత్సరానికి రూ” (20000) ప్రతి ఆటో కార్మికునికి ఇప్పించగలరు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కుటుంబ పోషణ పెను భారంగా మారి ఆర్థిక ఇబ్బందుల వలన చనిపోయిన ఆటో కార్మికుని కుటుంబంలో ఒక్కరికి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి (25) లక్షల ఎక్స్గ్రేషియా అందించాలి. అంతేకాకుండా అర్హులైన ఆటో కార్మికునికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇప్పించగలరు. మరియు (50) సంవత్సరాల పైబడిన ఆటో కార్మికులకి రూ” ( 10000 ) పెన్షన్ అందే విధంగా చూడాలి. ప్రతిరోజు రోడ్డు మీద బతికే ఆటో డ్రైవర్ పరిస్థితి గాలిలో దీపంగా ఉంటుంది. కావున ప్రతి కార్మిక కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తమ ద్వారా కల్పించాలని మంచిర్యాల జిల్లా & మరియు నస్పూర్ టౌన్ ఆటో కార్మికులు సంఘం తరఫున మీకు విన్నవించుకుంటున్నాం.
