Breaking News

రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన జెడ్పిటిసి

255 Views

ఎల్లారెడ్డిపేట, జనవరి 30 :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరకున్న అతి పురాతన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం పనులలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పురాతన ఆలయ ప్రహరీ గోడ కూల్చివేత పనులను ప్రారంభించారు ,
..అట్టి కూల్చివేత పనులను ఆదివారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి పరిశీలించారు , ఈ సందర్భంగా జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు కు , ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్ , సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వివరించారు ,
ఆలయ నిర్మాణానికి 15000000 రూపాయలు అవసరం పడుతుందని అట్టి నిధులను టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తో కలిసి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తో ఒకే విడత మంజూరు చేయించాలని వారు చీటీ లక్ష్మన్ రావు ను కోరారు ,
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో త్వరలోనే మాట్లాడి ఆలయ నిర్మాణానికి 15000000 ఒకేసారి మంజూరు ఇప్పిస్తామని జడ్పిటిసి లక్ష్మణరావు చెప్పారు ,
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గొ గుల్లపల్లి నరసింహ రెడ్డి , మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ హాసన్ , రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్ , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం , చెట్కూరి కృష్ణమూర్తి గౌడు , ఎలగందుల నర్సింహులు , బొమ్మకంటి శ్రీనివాస్ గుప్తా , నేవూరి వెంకట్ నరసింహారెడ్డి , వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ , తదితరులు ఆలయాన్ని సందర్శించారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7