(తిమ్మాపూర్, జూలై 03 )
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీడీఓ విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో నిర్వహించిన ఈ ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపకలను ఎంపీడీఓ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత- దేవేందర్ రెడ్డి, జడ్పిటిసి ఇనుకొండ శైలజ- జితేందర్ రెడ్డి, వైస్ ఎంపీపి ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కొత్త తిరుపతి రెడ్డి, చింతల రజిత -లక్ష్మ రెడ్డి, బండ రమేష్, కనకం కొంరయ్య,పుప్పాల కనకయ్య, వేల్పుల అనిత, ముప్పిడి సంపత్ రెడ్డి, పాశం తిలక్ ప్రియ -అశోక్ రెడ్డి, కవ్వంపల్లి పద్మ,కిన్నెర సుజాత
తిమ్మాపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ జయశంకర్, ఎంపీఓ కిరణ్ లతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




