గత పాలకులు దుబ్బాక నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని , దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ అన్నారు. గురువారం దుబ్బాక మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ముత్యం రెడ్డి ఆశయ సాధన కోసం చెరుకు శ్రీనివాస్ రెడ్డి తలపెట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వారీ సమస్యలతో పాటు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన రోడ్లు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సరైన పరిహారం అందని రైతుల బాధలు,నిరుద్యోగుల గోసలను చెరుకు శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు అన్నారు. కానీ గత పాలకులు ఈ నియోజకవర్గ ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకున్న, పలకరించిన దాఖలు లేవన్నారు. గత పాలకులు అధికారం కోసం పోటీ పడ్డారే తప్ప, దుబ్బాక అభివృద్ధి మరిచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఘనత ఆ రెండు పార్టీ నాయకులకే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుబ్బాక నియోజకవర్గ సమస్యలను చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ల దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలోనే దుబ్బాక నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలంతా గ్రామీణ ప్రాంతాల్లోనీ నెలకొన్న సమస్యలు తెలుసుకోడానికి ప్రతి కార్యకర్త ముందుండి పని చేస్తున్నారని అన్నారు.




