ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వక్రీకరించడం దృష్టిలో పెట్టుకొని జూన్ 26 రోజున రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర పిలుపుమేరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ ముస్తాబాద్ శాఖ ఈబంధుని ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయవలసిందిగా ప్రకాష్ నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ మరియు యూనిఫామ్స్ వెంటనే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలి మరియు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి అదేవిధంగా డిఎస్సీ ఎంఈఓ రిక్రూమెంట్ విడుదల చేసి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గుర్తింపు లేకున్నా నడిపిస్తున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనాలకు విరుద్ధంగా అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో మూసివేసిన 8624 ప్రభుత్వ పాఠశాలలను పునర్ ప్రారంభించి ప్రభుత్వ విద్యను పటిష్టపరిచాలి. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని విషయాన్ని విస్మరించారు. ఈకార్యక్రమంలో ధనం సోత్ ప్రకాష్ నాయక్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండల కన్వీనర్ పన్ని కిషోర్, రాజేష్, సమీర్, శివ తదితరులు పాల్గొన్నారు.
