బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బొమ్మని నర్సమ్మ కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రోజు మధ్యాహ్నం మరణించింది.మొబైల్ ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం, స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,ల చేతుల మీదుగా అందజేశారు.అలాగే మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి 500,వార్డు సభ్యులు కొండ గాలేష్ 500 రూపాయలు అందజేశారు.వారితో పాటు గ్రామస్తులు బొమ్మని శ్రీహరి తదితరులు ఉన్నారు.





