పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ అందజేసిన
. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల
కనకయ్యముదిరాజ్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 25)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపిటిసి తుమ్మల లక్ష్మీ నర్సమ్మ,బిఆర్ఎస్ సినియర్ నాయకులు తుమ్మల కనకయ్య ముదిరాజ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ గత ఐదు సంవత్సరాల నుండి పదవుల తోటి సంబంధం లేకుండా విద్యార్థుల విద్యకు సంబంధించిన అన్ని సౌకర్యాలు అందజేసిన తుమ్మల కనకయ్య ముదిరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. అనంతరం తుమ్మల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే నేడు గొప్ప గొప్ప అధికార పదవుల్లో ఉన్నారని,ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాద్యాయులు ఉంటారని,చక్కని బోధన ఉంటుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు,విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చిడానికి శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు.ఈ పాఠశాలలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్న ఉపాద్యాయులను అభినందించారు. ఉపాధ్యాయులు అనంతరం తుమ్మల కనకయ్య ముదిరాజును శాలువతో సత్కరించి సన్మానించారు.
