విద్య

విద్యార్ధుల ఆత్మహత్యల పై ప్రభుత్వం స్పందించాలి…

167 Views

(తిమ్మాపూర్ ఫిబ్రవరి 19)

తెలంగాణలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో గత 15 రోజులలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి డిమాండ్ చేశారు….

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో గత కొన్ని రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య లపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో విద్యార్థుల పట్ల వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకొని పిల్లలకు మానసికంగా మనోధైర్యం నింపి,వారి చదువుకు తోడ్పాటుగా ప్రతి సంక్షేమ హాస్టల్లో ఒక సైక్రియాటిస్ట్ వైద్యుని ఏర్పాటు చేయాలని అన్నారు.

మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చాలా బాధాకరం ఆవేదన వ్యక్తం చేస్తూ,దుఃఖ సాగరంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మనోధైర్యం కల్పింస్తూ ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని అన్నారు.

అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా జన్వాడలో మత చాందస వాదులు దళిత కుటుంబాలపై పాశవికంగా దాడి చేసి,తీవ్రంగా గాయపరిచిన దుండగుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కోయడం మురళి, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్,మండల కార్యవర్గ సభ్యులు సముద్రాల మల్లేష్, బాలాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గోదేర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found