రాజకీయం

దిష్టిబొమ్మ దగ్ధంచేసిన బిఆర్ఎస్ శ్రేణులు…

104 Views

ముస్తాబాద్, జూన్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని తెలంగాణతల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకొని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజీవ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం ఎంతవరకు సమంజసం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జగిత్యాల ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీపై విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా వేసుకోవడం ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ మాజీ మండల అధ్యక్షులు కొమ్ముబాలయ్య, మెంగని మనోహర్, కంచం నర్సింలు, బైతి నవీన్, చెవుల మల్లేశం, శీలం స్వామి, గూడూరి భరత్, సేరయ్య, మల్లేష్ యాదవ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7