చినుకు పడితే రోడ్లంత చిత్తడే ఎరులై పారుతున్న మురికి వరద నీరు. రాయపోల్ మండలం అనాజీపూర్ దళితవాడ పరిస్థితి. గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు. దానితో కాలనీలో ఉంటున్న ప్రజల పరిస్థితి చాలా దుర్బలంగా మారింది. దళిత వాడకు చెందిన ప్రజలు మురికి కాలువలు లేక తరచూ అనారోగ్యబారిన పడిన పట్టించుకున్న నాధుడే లేరు. కనీసం సంబంధిత అధికారులు అయిన పట్టించుకుంటారని వినతి పత్రాలు ఇచ్చిన, వివిధ దిన పత్రికలలో వార్తలు ప్రచురితమైన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఇప్పటి వరకు కనీసం దళిత వాడను సందర్శించకపోవడం విచారకరం. దళితులు అంటే చిన్న చూపా..?? దళితులు ఈ దేశ పౌరులు కాదా..?? అంటూ దళిత కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే దళిత కాలనీలను సందర్శించి సమస్యను పరిష్కరించాలని అనాజీపూర్ దళిత కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
