(మానకొండూర్ జూన్ 20)
మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నీ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు..
గతంలో స్కూల్ సందర్శించిన సమయంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తున్నారు.
పాఠశాల గ్రౌండ్ లో కూరగాయల మొక్కలు నాటుటకు స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ తో దున్నారు తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం ఎంపీపీ నిధుల నుండి లక్ష రూపాయలు మంజూరు చేయించారు అలాగే రేపటి లాగా కొత్త బోర్ వేయిస్తానని చెప్పారు
అనంతరం పాఠశాల ముందు ఉన్న మెయిన్ రోడ్డు డబల్ రోడ్డు వేయడంతో రోడ్డు ఎత్తు పెరగడం వల్ల పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతుంది అని చెప్పగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాట్లాడి వెంటనే మెయిన్ గేట్ ముందు డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.
అ తర్వాత పాఠశాల విద్యార్థులకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే విద్యార్థులకు మాత్రలు వేసి స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.