పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ?
.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 20
గత అక్టోబర్ మాసంలో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పారిశుద్ద కార్మికులు బతుకమ్మ చెరువు మెట్లు శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి చనిపోయిన మూడు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం మరిచిపొయిందని గురువారం నాడు ఆ కుటుంబాలను కలిసిన సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పి. శంకర్ మాట్లాడుతూ గత అక్టోబర్ మాసంలో అప్పుడున్న బి అర్ ఎస్ ప్రభుత్వం హరిష్ రావు అదేశాల మేరకు ఎఫ్ డి ఎస్ చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి పారిశుద్ద కార్మికులు యాదమ్మ, బారతమ్మ, బాబు మరణించారు వారి కుటుంబాలకు ఇళ్ళు, పిల్లల చదువు ప్రభుత్వ పరంగా అన్ని విదాల అదుకుంటుమని ఇచ్చిన హామీ నిలబెట్టుకొవలన్నారు. అప్పుడు హామీ ఇచ్చిన నాయకులు ఇప్పటికి ఆ కుటుంబాల వైపు చూడటం లేదన్నారు. ప్రభుత్వం మారింది ఆ కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారులు గుర్తుచేసి ప్రభుత్వ పరంగా ఆదుకొని ఇళ్ళు, పిల్లల చదువు తక్షణమే అమలుచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, రాష్ట్ర నాయకురాలు పులి కల్పన, బి ఎస్ పి నాయకులు కనకప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
